ఖమ్మం, మే 13 : సుస్థిర జీవనోపాధి లక్ష్యంగా మహిళా మార్ట్ ఉండాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మహిళా మార్ట్‌ను లాభాల బాటలో నడిపించేలా, మెరుగ్గా నిర్వహించేలా మహిళా సంఘాలకు ముందుగానే శిక్షణ అందించినట్లు చెప్పారు. ఖమ్మం నగరంలోని సీక్వెల్ రోడ్డులో మహిళా మార్ట్ ఏర్పాటు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. మార్ట్‌లో ఏర్పాటు చేసే ఎక్విప్మెంట్స్, ప్రొడక్ట్స్ తదితరాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా మార్ట్ ప్రారంభించిన తర్వాత దాని నిర్వహణ బాధ్యత స్వశక్తి మహిళా సంఘాలపై మాత్రమే ఉంటుందని అన్నారు.
మార్ట్ ముందు భాగంలో ఉన్న ఓపెన్ స్పేస్‌లో రిటైల్ బిజినెస్ కింద ఏర్పాటుచేస్తున్న షాపు ముందు వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా నీడలో కూర్చొనే విధంగా సీటింగ్ సమకూర్చాలని సూచించారు. అలాగే, పారింగ్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహిళా మార్ట్ నిర్వహణ కట్టుదిట్టంగా ఉండాలన్నారు. తకువ సామాన్లు ఉన్నప్పటికీ శుభ్రంగా నిర్వహించాలని సూచించారు. డీఆర్డీవో సన్యాసయ్య, పీఆర్ ఈఈ వెంకట్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.