తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఈ మేరకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేంసూరు పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల వాసులు మంచినీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు.
- ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
వేంసూరు, ఫిబ్రవరి 26: తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఈ మేరకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేంసూరు పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల వాసులు మంచినీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సీపీఐ అనుబంధ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో సోమవారం వేంసూరులో ఖాళీ బిందెలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు దండు ఆదినారాయణ మాట్లాడుతూ..
మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు గాను సుమారు 15 పంచాయతీల్లో మంచినీటి సమస్య ఉందని అన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇళ్లవాసులు నీళ్ల కోసం 2 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈ సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

