కారేపల్లి, అక్టోబర్ 25 : రైల్వే లైన్ డబ్లింగ్ పనులకై భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. కారేపల్లి మండల కేంద్రమైన కారేపల్లి జిన్నింగ్ మిల్లు నందు భూములు కోల్పోతున్న నిర్వాసితులు శనివారం ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేసి తమ సమస్యను విన్నవించారు. తమ భూములకు న్యాయపరంగా రావాల్సిన నష్ట పరిహారాన్ని అందేలా చూడాలని ఎమ్మెల్యేని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఫోన్ ద్వారా డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరితో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలు చర్చించేందుకు మరొకసారి గ్రామ సభను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా రైతులకు ఇటీవల కొన్ని ప్రాంతాల్లో అందజేసిన నష్ట పరిహారం వచ్చేలా చూస్తానని తెలిపారు.