Fire Accident | మామిళ్లగూడెం : వంట గది.. పంట చేలు.. షాపింగ్‌మాల్స్.. ఆసుపత్రులు.. విద్యాసంస్థలు.. ఆఫీసులు.. పెట్రోల్‌బంకులు.. ఇలా స్థలమేదైనా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఎందుకంటే వేసవికాలం వచ్చింది కదా అందుకే. సహజంగా వేసవిలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయని మనందరికీ తెలుసు. ప్రధానంగా గ్రామాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ పనులు ముగియడంతో ఆయా పంటచేనులో ఎండిన గడ్డి, ఇతర పంట వ్యర్థాలను కాల్చి వేస్తుంటారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే గాలికి నిప్పురవ్వలు ఎగిరి సమీపంలో ఉన్న గడ్డివామి లేదా ఇంటి పరిసరాల్లో పడితే మంటలు దావనంలా వ్యాప్తి చెందుతాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా విద్యుత్ సంబంధిత అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ప్రధానంగా ఎండ తీవ్రతను తట్టుకునేందుకు షాపింగ్‌మాల్స్, ఆసుపత్రులు, ఇతర వ్యాపార సముదాయాలతోపాటు నివాసాల్లో ఏసీలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణలు షాట్ సర్యూట్‌కు గురై మంటలు వ్యాపిస్తుంటాయి. ఇలా అగ్ని ప్రమాదం ఏరూపంలో ఉన్నప్పటికీ ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టమూ వాటిల్లుతుంది. అందుకే వేసవికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత్తైన ఉంది.
సూల్స్, షాపింగ్‌మాల్స్, ఆసుపత్రుల్లో ఆర్సీసీ లేదా కాంక్రీట్ క్లాబులను మాత్రమే పై కప్పుగా వాడాలి. ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్‌ను ఉపయోగించాలి. న్యూల్స్, హాస్పిటల్స్‌లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు క్షేమంగా తప్పించుకునేందుకు సరైన ప్రణాళికను రచించి అది అందరికి తెలిసే విధంగా తగు ప్రదేశాల్లోఉంచాలి. షాపింగ్‌మాల్స్‌లో ఎలక్ట్రికల్ సామగ్రిని ఐఎస్ఐ మారు కలిగిన వాటిని మాత్రమే వాడాలి. ఆసుపత్రులు, సూల్స్ నుంచి బయటికి వెళ్లు మార్గాలలో మెట్లు, తలుపు వద్ద ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101కి సమాచారం అందించాలి. తాటాకులు, గడ్డితో చేసిన పై కప్పును పాఠశాలలు, ఆసుపత్రులకు వాడరాదు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్యూట్ జరిగినప్పుడు అగ్నిప్రమాదం సంభవించకుండా మినియేచర్ సర్యూట్ బ్రేకర్స్‌ను అమర్చుకోవాలి. పరిసరాలు శుభ్రతను పాటించాలి, అవరణంలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి, అగ్ని ప్రమాదం జరుగుటకు ఆసారం ఉన్న ప్రదేశాలను ముందుగా గుర్తించి ఆ ప్రాంతాలను ప్రమాదరహితం చేయాలి.
వంటింటి కింది పై భాగాల్లో గాలి, వెలుతురు ఉండేటట్లు చూడాలి. వంటింట్లో చిన్నపిల్లలను అజాగ్రత్తగా వదలరాదు. చెడిపోయిన గ్యాస్ ట్యూబ్‌లు వాడరాదు. ఐఎస్ఐ మార్కు ఉన్న కొత్త ట్యూబ్‌లను వెంటనే మార్చుకోవాలి. ఎల్పీజీ వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ వాల్ ఆపివేయాలి. గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్ తీసివేయాలి. అటువంటి సమయంలో ఎలక్ట్రికల్ స్వీచ్ ఆన్, ఆఫ్ చేయరాదు. మండుతున్న స్టవ్‌లో కిరోసిన్ పోయవద్దు. కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివి వంటగదిలో ఉంచరాదు. వంట చేస్తున్నప్పుడు సరియైన నూలు, సిఫ్రాన్ వస్త్రాలు ధరించాలి. దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తవద్దు. నేలపై దొర్లండి. లేదా దుప్పటి చుట్టుకోండి. కాలిన శరీర భాగం మీద చల్లని నీరు పోయరాదు. పొగతో నిండిన గదుల్లో మోచేతులు, మోకాళ్లపై పాకండి, ముకుకు, నోటికి అడ్డంగా తడిగుడ్డ నుంచి గాలి పీల్చడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ని పీల్చకుండా ఆపవచ్చు.
పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే వామిగా వేయాలి. గడ్డివాములు నివాస గృహాలకు తప్పనిసరిగా 60 అడుగుల దూరంలో ఉండాలి. చిన్నచిన్న గడ్డివాములను నిర్మించాలి. గడ్డివాముల మధ్యలో సందు ఎక్కువగా ఉండాలి. గుడిసెకు గుడిసెకు మధ్య కనీసం 30అడుగుల దూరాన్ని పాటించాలి. ప్రధానంగా వేసవికాలంలో ఏ విధమైన బహిరంగ మంటలను పెట్టరాదు. వంట పొయ్యిలను పడుకునే ముందు అర్పివేయాలి.
అగ్ని మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందనే మాట నిజమే కానీ.. దానిని ఉపయోగించడంలో ఏ మాత్రం పొరపాటు చేసినా అది ఎంతో ప్రమాదం కలుగజేస్తుందనేది అక్షర సత్యం. చిన్న నిప్పురవ్వను అలక్ష్యం చేసినా అది మనకు ఘోరమైన నష్టాన్ని కలిగిస్తుంది. ప్రాణ, ఆస్తినష్టంతోపాటు దేశ సంపద ధ్వంసం కావచ్చు. అగ్ని విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త పనికిరాదు అని పెద్దలు ఇప్పటికీ గ్రామాల్లో హెచ్చరిస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాల్లో భారీ ప్రమాదాలు జరగకుండా కాపాడడం అగ్నిమాపకశాఖ ప్రధాన లక్ష్యం. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కంగారుపడి మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. వెంటనే సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించాలి. సమాచారం అందించేటప్పుడు మీ పేరు, ఫోన్‌నంబర్, ప్రమాదం జరిగే ప్రదేశం, అడ్రస్ వివరాలను వివరంగా తెలియజేయాల్సి ఉంటుంది.
ఇంట్లో వస్తువులను అల్మారాల్లో, సెల్ఫ్‌ల్లో సక్రమంగా సర్దుకొని.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, పటాకులు, ఇతర మండే వస్తువులు, పేలుడు పదార్థాలు ఏవీ అందుబాటులో ఉంచరాదు. కాల్చిన సిగరెట్లు, బీడీలు, చుట్టలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా బయటకు పారవేయరాదు. ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలనే ఉపయోగించాలి. పాడైన వైర్లను వాడొద్దు. ఓవర్ లోడ్ చేయవద్దు. ఎలక్ట్రికల్ సాకెట్ నందు కెపాసిటీకి తగిన ప్లగ్‌ను మాత్రమే వాడాలి. పకమీద పడుకుని పొగతాగవద్దు. ఇంటి నుంచి ఎకువ రోజులు సెలవులకు బయటికి వెళ్లినప్పుడు ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయాలి. పటాకులు కాల్చేటప్పుడు నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించాలి. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే అర్పడానికి ఎల్లవేళలా నీటిని ఇంట్లో నిల్వ ఉంచాలి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే ఫైర్ 101, 100 టోల్ ఫ్రీ నంబర్లు, ఇతర ఫైర్స్టేషన్ల అధికారులకు సమాచారం అందించాలి. ఫైర్స్టేషన్ల అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. వేసవికాలంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి.
– ఏ.జయప్రకాశ్, ఖమ్మం జిల్లా అగ్నిమాపక అధికారి