కారేపల్లి, ఏప్రిల్ 15 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు గ్రామ సభ నిర్వహించారు. డోర్నకల్ నుండి కొత్తగూడెం రైల్వే రెండో లైన్ పనులను పరిశీలించిన రైల్వేశాఖ డీఆర్ఓ రైతుల భూమి, ఇండ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నష్ట పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు. భూములు పోయిన రైతులకి, ఇల్లు కోల్పోయిన వారికి తగు న్యాయం చేస్తామని గ్రామ సభలో వారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, జిల్లా, మండల రెవెన్యూ అధికారులు, రైల్వే బోర్డు మెంబర్, జిల్లా ఆఫీసర్ రాజేశ్వర్, సింగరేణి మండల తాసీల్దార్ సంపత్ కుమార్, ఆర్పీ నరసింహారావు, రైల్వే ఏఈ శ్రీకాంత్ రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ తురక నారాయణ, రైతు నాయకులు తోగారు, శ్రీను, ముక్క వెంకటేశ్వర్లు, ముళ్ల యాకాంబరం, గుండెబోయిన కోటేశ్వరరావు, కుమ్మరి రాజు, ఎస్కే అమీర్ పాషా, ఆగోళ్ల హరి, సాంబ పాల్గొన్నారు.
Singareni : భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : దక్షిణ మధ్య రైల్వే అధికారులు