మధిర, మార్చి 20 : చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలోని బస్టాండ్ వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఖమ్మం-బోనకల్లు ప్రధాన రోడ్డు మార్గం కావడంతో నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుంది. వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.చిరంజీవి తెలిపారు. బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలాగే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాలు వేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం అంబటి శాంతయ్య, పంచాయతీ సిబ్బంది దేశబోయిన కొండలు, భహాటం ఫణిరాజు, కందిమళ్ల బుచ్చిబాబు, పడిశాల గోపి, మంద రాజ్‌కుమార్, తురక వెంకటేశ్వర్లు, పడిశాల యశోద, షేక్ బాషా సాహెబ్, ఓర్సు పుష్ప పాల్గొన్నారు.