– కారేపల్లిలో ఆగకుండా వెళ్లిన రైల్వే అధికారి
– నిరాశతో వెనుదిరిగిన రైల్వే భూ నిర్వాసితులు
కారేపల్లి, మార్చి 25 : కారేపల్లి రైల్వే స్టేషన్కు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోనల్ డీఆర్ఎం బుధవారం వస్తున్నారనే సమాచారంతో సింగరేణి రెవెన్యూ గ్రామ పరిధిలోని రైల్వే డంబ్లింగ్ ట్రాక్ నిర్వాసితులు గంటల తరబడి రైల్వేస్టేషన్లో ఎదురు చూశారు. భద్రాచలం రోడ్డు నుండి డోర్నకల్ వైపు రైల్వే మార్గంలో ప్రత్యేక రైలులో వెళ్తున్న రైల్వే అధికారులకు తమ సమస్యలను చెప్పుకునేందుకు భూ నిర్వాసితులు స్థానిక సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ తో కలిసి కారేపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. కానీ రైల్వే అధికారులు స్టేషన్లో ఆగకుండానే వెళ్లిపోయారు. దీంతో రైల్వే డంబ్లింగ్ ట్రాక్ నిర్వాసితులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. రైల్వే డంబ్లింగ్ ట్రాక్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు ప్రస్తుత మార్కెట్ రేటు అనుసరించి పరిహారం ఇప్పించాలని, సంత సమీపంలో క్యాబిన్ వద్ద ఉన్న రైల్వే గేటును మూసివేయకుండా ఉంచాలని కోరుతూ రైల్వే అధికారులకు వినతి పత్రం సమర్పించేందుకు గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెంది వెనుతిరిగారు.

డీఆర్ఎం రాక కోసం గంటల తరబడి నిరీక్షణ