ఎర్రుపాలెం, అక్టోబర్ 9: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ కారు గుర్తుపై ఓటు వేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు కోరారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ఎర్రుపాలెం మండలంలో సోమవారం పర్యటించిన ఆయన.. తొలుత ఇనగాలి గ్రామంలో గృహలక్ష్మి ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్‌సెంటర్‌ను ప్రారంభించారు. సబ్సెంటర్కు స్థల వితరణ చేసిన దాత తలపురెడ్డి శ్రీనివాసరెడ్డిని సన్మానించారు. తక్కెళ్లపాడులో కూడా గృహలక్ష్మి ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు.
ఎర్రుపాలెంలోనూ నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చినా సంక్షేమ పథకాలు అమలులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు, సత్యనారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శిరీష, కవిత, రామకృష్ణ, సాంబశివరావు, రామకోటేశ్వరరావు, భాస్కర్‌రెడ్డి, బాలరాఘవరెడ్డి, నరసింహా, కృష్ణారావు, చిట్టిబాబు, శ్రీనివాసరెడ్డి, సిద్ధారెడ్డి, సాంబశివరావు, అప్పారావు, మదన్‌మోహన్‌రెడ్డి, విజయబాబు, కిశోర్‌బాబు, రాము, శ్రీను, తిరుపతిరావు, పుల్లారెడ్డి, ప్రశాంత్, జనార్దన్‌రెడ్డి, సరోజిని, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.