ఖమ్మం, సెప్టెంబర్ 5 : ఖమ్మం మున్నేరు, పాలేరు వరద బాధితుల సహాయార్థం సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు పంపిన ఆరు లారీల నిత్యావసర సరుకులు గురువారం రాత్రి ఖమ్మానికి చేరాయి. వీటిని సిద్దిపేట నియోజకవర్గ హరీశ్‌రావు టీం సభ్యులు.. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో అందజేశారు.
ఆరు లారీల్లో బియ్యం, నిత్యావసర సరుకులు, బ్లాంకెట్స్, బ్రెడ్ ప్యాకెట్లు, ఆలు, ఉల్లిగడ్డలు, ఇతర సామగ్రి పంపించారు. వాటిని ఎంపీ రవిచంద్రతో కలిసి బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, బెల్లం, తెలంగాణ ఉద్యమకారులు రామ్మూర్తి, సుబ్బారావు తదితరులు పరిశీలించి డివిజన్, రూరల్ గ్రామాల వారీగా కేటాయించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.