ఖమ్మం, మార్చి 2: ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు గాను ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ తన ధర్మపత్ని డాక్టర్ సుధేశ్ దన్ఖడ్తో కలిసి న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరై రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందించారు. శాలువాతో సతరించి హృదయపూర్వక స్వాగతం పలికారు.