పాల్వంచ, ఏప్రిల్ 23:బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ మరో వందేళ్లపాటు గుర్తుండేలా జరగబోతోందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రజతోత్సవ సన్నాహక కార్యక్రమంలో భాగంగా పాత పాల్వంచలోని తన స్వగృహంలో బుధవారం ఏర్పాటుచేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత మాటలతో, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ప్రజలకు చేసిన మేలు శూన్యమని విమర్శించారు.
హామీలు నెరవేర్చడంలో, పథకాలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని స్పష్టం చేశారు. అబద్ధాలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కిలారు నాగేశ్వరరావు, వనమా రాఘవేందర్రావు, కాంపెల్లి కనకేశ్, మడివి సరస్వతి, దాసరి నాగేశ్వరరావు, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి, కొత్వాల సత్య, భూక్యా చందూనాయక్, వీరూనాయక్, తెలంగాణ సురేశ్, వీర్రాజు, చందు, అన్నం ప్రభాకర్, వీరన్న, కొండల్రావు, నరేశ్ పాల్గొన్నారు.
సత్తుపల్లి/సత్తుపల్లి టౌన్, ఏప్రిల్ 23 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పండుగలా జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పల్లె, పట్నం నుంచి తరలివచ్చేందుకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. బుధవారం తల్లాడలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి నివాసంలో, పెనుబల్లిలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా సన్నద్ధం చేయాలని సూచించారు. 25న ఎడ్లబంజరలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
సత్తుపల్లి నియోజకవర్గం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు బయల్దేరేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆయా సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకులు దుగ్గిదేవర వెంకట్‌లాల్, దొడ్డా శ్రీనివాసరావు, మురళి, జీవీఆర్, వజ్రాల రామిరెడ్డి, షేక్ హుస్సేన్, మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, మాజీ జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణరావు, సీనియర్ నాయకులు కోటగిరి సుధాకర్‌బాబు, లక్కినేని వినీల్, మందడపు అశోక్‌కుమార్, టీవీ రామారావు, కొప్పుల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి, ఏప్రిల్ 23 : బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ కోరారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27 జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం దాస్‌తండాలో పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రజతోత్సవ సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ సభకు ఊరూ.. వాడా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిందేనని ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు బోడ బాలునాయక్, బానోత్ రామ, భూక్యా లాలు, బానోత్ మోహన్, నాగేందర్ పాల్గొన్నారు.