ఖమ్మం, మార్చి 13: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కొత్తగూడెంలో టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొని కవిత బర్త్‌డే కేక్‌ను కట్ చేసి శ్రేణులకు పంపిణీ చేశారు. అనంతరం కవిత పేరిట మొక్కలు నాటారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జాగృతి బాధ్యులు కేకులు కట్ చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కవితమ్మ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.