ఖమ్మం, ఏప్రిల్ 4: వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో తాము వ్యతిరేకించామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. ముస్లింల మనోభవాలను తమ పార్టీ మొదటి నుంచీ గౌరవిస్తున్నదని, ఎప్పటికీ గౌరవిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ముస్లింలకు వ్యతిరేకమైన వక్ఫ్ సవరణ బిల్లును బీఆర్ఎస్ రాజ్యసభలో వ్యతిరేకించిందని తెలిపారు. పార్లమెంట్లో బీఆర్ఎస్కు సంఖ్యాబలం తకువ ఉన్నప్పటికీ ప్రజల పక్షాన పోరాటంలో ముందడుగులో ఉన్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని అన్నారు.