మామిళ్లగూడెం, అక్టోబర్ 27: ఫ్యామిలీ వేడుకను రేవ్ పార్టీగా దుష్ప్రచారం చేస్తూ కేసులు బనాయించడం సరైనది కాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈ దుష్ప్రచారాలను, తప్పుడు కేసులను ఆదివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాజ్ పాకాల తన కుంటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న నివాసంపై పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తుండడం అభ్యంతరకరమని అన్నారు.
ప్రభుత్వ పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని, ప్రతిపక్షానికి చెందిన ప్రముఖ నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర ప్రముఖల ప్రతిష్టను దిగజార్చాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.