ఖమ్మం/ రఘునాథపాలెం, జూన్ 23: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదివారం నియమించారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆశీస్సులతో ఆయన ఇటీవలే మరోసారి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. బీసీ వర్గానికి చెందిన రవిచంద్రను.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా నియమించడం పట్ల ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీసీ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తనను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఎంపిక చేసిన పార్టీ అధినేత కేసీఆర్‌కు రవిచంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.