బోనకల్లు, మే 01 : పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో సీపీఎం సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే వేడుకలను నిర్వహించారు. సీపీఎం కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయకుండా పెట్టుబడిదారీ విధానాలకు ఉపయోగపడే చట్టాలను మాత్రమే అమలు చేస్తున్నారని విమర్శించారు.
కార్మికుల హక్కుల సాధన కోసం పుట్టింది ఎర్రజెండా అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను ఒక్కొక్కటిగా రద్దు చేసుకుంటూ పోతుందన్నారు. ఉన్న చట్టాలను అమలు చేయకుండా పెట్టుబడిదారీ విధానాలకు అనుకూలంగా ఉండే కార్మిక చట్టాలను తీసుకువస్తూ, కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మతాలు, కులాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుందని, ఈ ప్రయత్నాలను కార్మిక వర్గం తిప్పి కొట్టాలన్నారు. సీపీఎం సీనియర్ నాయకులు కొంగర వెంకటనారాయణ, మాజీ సర్పంచ్ కొమ్ము శంకర్రావు, మండల కమిటీ సభ్యులు దొప్ప కొరివి వీరభద్రం, కందికొండ శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, పిల్లలమర్రి వెంకట అప్పారావు, బూర్గుల అప్పాచారి, పిల్లలమర్రి నాగేశ్వరరావు, బొడ్డుపల్లి కోటేశ్వరరావు పార్టీ జెండాలను ఎగురవేశారు.
ఆయా కార్యక్రమాల్లో బుగ్గవేటి సరళ, కొంగర వెంకటనారాయణ, కందికొండ శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బంధం వెంకటరాజ్యం, షేక్ హుస్సేన్, దారగాని కొండలు, బోయినపల్లి కృష్ణమూర్తి, బొడ్డుపల్లి నాగచంద్రుడు, బొడ్డుపల్లి బ్రహ్మం, బొడ్డుపల్లి కోటేశ్వరరావు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, బొడ్డుపల్లి పుష్పావతి, బొడ్డుపల్లి రాఘవమ్మ, గద్దె భూషమ్మ, పిల్లలమర్రి ఝాన్సీ, కందికొండ నాగమణి, కొమ్మినేని భద్రమ్మ, బొడ్డుపల్లి నాగమణి, విద్యగిరి మణెమ్మ పాల్గొన్నారు.