ఎర్రుపాలెం, సెప్టెంబర్ 3 : తమ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఆయా పార్టీలు, సంఘాలు, కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏకరువు పెట్టాయి. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. సీఐటీయూ కార్మిక సంఘం నాయకుడు మద్దాల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని అన్నారు. వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు లేక కుటుంబ పోషణకు అప్పులు చేసి జీవనం కొనసాగించాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు గంతాల నాగేశ్వరరావు, కలపాల రవి, పెద్దమల్ల శ్రీనివాసరావు, దూదిగం శ్రీనివాసరావు, గోపాలరావు, బొక్కా నాగేశ్వరరావు, బాజీ, లాలు, అనిల్, జమలయ్య పాల్గొన్నారు.
కారేపల్లి, సెప్టెంబర్ 3 : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిషరించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కారేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట జీపీ వరర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల కన్వీనర్ కే.నరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం జీపీ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, బీమా వంటి సౌకర్యాలు కల్పించకపోవటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కార్మికులన శ్రమను దోచుకోవటానికి మల్టీపర్పస్ విధానాన్ని, పనిగంటల పెంపును తీసుకొచ్చిందన్నారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ సింగరేణి మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ నాగేశ్వరరావు, ఎస్కే హుస్సేన్, నాయకులు బాలయ్య, జి.శ్రీను, గౌతమ్, మంగీలాల్, హేమ్‌చంద్, ఆదెర్ల శ్రీను, నంద, భాసర్, నగేష్ పాల్గొన్నారు.
మధిర, సెప్టెంబర్ 3 : తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని చింతకాని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అన్నారు. మత్కేపల్లి గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ రైతుబృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ రైతులు పెసర, పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. చింతకాని తహసీల్దార్ కరుణాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు బొడ్డు వెంకటరామారావు, గురజాల హనుమంతరావు, మంకిన రమేష్, రత్నాకర్, గడ్డం శ్రీను, పర్సగాని ఏడుకొండలు, నాన్నక నరసింహారావు, పాపిన్ని రంగారావు, శీలం నరసింహారావు పాల్గొన్నారు.
సత్తుపల్లి, సెప్టెంబర్ 3 : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణిని వీడకుంటే ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కళ్యాణం కృష్ణయ్య, సుబ్బయ్య అన్నారు. సత్తుపల్లిలోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రిటైర్డు ఉద్యోగులు సంవత్సరాల తరబడి తమకు రావాల్సిన డబ్బుల కోసం ఆవేదనతో ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటికీ లిఖితపూర్వక ఉత్తర్వులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం సత్తుపల్లి యూనిట్ సమావేశం బుధవారం జరిగింది. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులుగా కేశవరెడ్డి, సూర్యప్రకాశ్ ఎన్నికయ్యారు. ఆర్థిక కార్యదర్శిగా జీ.కృష్ణయ్య, సహాధ్యక్షులుగా బూరుగు దాసు, ఉపాధ్యక్షులుగా డీ.కృష్ణయ్య, వాణి, సహాయ కార్యదర్శులు సాంబశివారెడ్డి, నర్సయ్య, ప్రచార కార్యదర్శిగా మధుసూదన్‌రాజు, జిల్లా కౌన్సిలర్లుగా యోగానందం, కమలకుమారి, మహబూబ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వేల్పుల కృష్ణయ్య, రఘుపతిరెడ్డి, భద్రుద్దీన్, అద్దంకి వెంకటరత్నం, రామిశెట్టి సుబ్బారావు, డీవీ రామారావు, సరోజిని, సత్యనారాయణ, మాధవరెడ్డి, రత్తయ్య, పూర్ణచంద్రరావుతోపాటు, సత్తుపల్లి, వేంసూరు మండలాల విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు.
మధిరరూరల్, సెప్టెంబర్ 3 : అర్హులందరికీ ఇల్లు రాలేదని, ఇందిరమ్మ కమిటీలు వెంటనే రద్దు చేయాలని సీపీఎం డివిజన్ నాయకుడు పాపినేని రామనర్సయ్య డిమాండ్ చేశారు. రాయపట్నం గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదని, అర్హత లేని వారికి ఇల్లు కేటాయించారని ఆరోపించారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు అందజేశారు. సీపీఎం నాయకులు పెంటి వెంకట్రావు, తేలబ్రోలు రాధాకృష్ణ, ఎం.జ్యోతి, ఎస్.సత్యావతి, పీ.లక్ష్మి, దేవరకొండ రావులమ్మ, ఎం.సురేష్, గద్దల ఏసుపాదం, ఎం.ఆదాం పాల్గొన్నారు.
బోనకల్లు, సెప్టెంబర్ 3 : హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కని రాష్ట్ర కమిటీ కోరింది. భట్టివిక్రమార్క స్పందిస్తూ డిమాండ్లను దశల వారీగా పరిష్కరిస్తామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్‌పాషాకు తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల యాదగిరి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్‌పాషా, ఉపాధ్యక్షుడు సహదేవ్, రాష్ట్ర కార్యదర్శులు జానకీరామ్, మహేందర్ పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 3 : మండల కేంద్రమైన తిరుమలాయపాలెంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తిరుమలాయపాలెం బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలో పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పలుమార్లు వినతిపత్రం అందజేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తిరుమలాయపాలెంలో మంజూరైన ఐటీఐ కళాశాలను 254 సర్వేనెంబర్‌లోని ప్రభుత్వ భూమిలో చేపట్టాలని, మంత్రి పొంగులేటి హామీ మేరకు తిరుమలాయపాలెం సీహెచ్‌సీ ఆసుపత్రిలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని మంజూరు చేయాలని, ఇళ్ల పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు స్థలాలు చూపించాలని, అసంపూర్తిగా ఆగిపోయిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, షాదీఖానా నిర్మాణాలను పూర్తిచేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, బీఎస్పీ నియోజకవర్గ నాయకుడు ఎన్నబోయిన రమేష్, టీడీపీ మండల నాయకుడు నామా ప్రసాద్, బీఆర్ఎస్ మండల నాయకుడు గంట కృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకుడు చింతిరాల నాగభూషణం, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ నాయకుడు ఆరెంపుల వెంకన్న, ఆర్మీ పాల్గొన్నారు.
ముదిగొండ, సెప్టెంబర్ 3 : ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఆ సంఘం ఆధ్వర్యంలో చిరుమ్రరి, పమ్మి. వనంవారికిష్టాపురం, కమలాపురం, లక్ష్మీపురం పాఠశాలలను సందర్శించారు. జిల్లా నాయకుడు సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం విచారకరమన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. వర్షం వస్తే పాఠశాలల ఆవరణలు చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు బోడ వెంకట్, కొమ్ము మహేష్ తదితరులు పాల్గొన్నారు.