కారేపల్లి, డిసెంబర్ 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి గ్రామానికి చెందిన, వైరా ఎస్ఐ పుష్పాల రామారావు, కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులు దివంగత పుష్పాల జగన్నాథం, ఇందిరమ్మల జ్ఞాపకార్థం వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు శనివారం యూనిఫామ్లు ఉచితంగా అందించారు. మొత్తం 70 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ రామారావు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ నవీన జ్యోతి తమ కళాశాల విద్యార్థులకు యూనిఫామ్ లు కావాలని విజ్ఞప్తి చేయగా తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక సేవా కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు వైరాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యూనిఫామ్లు అందించనట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచిపేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భముగా తాము అడిగిన వెంటనే యూనిఫామ్లు అందించిన ఎస్ఐకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు.

Karepally : తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కళాశాల విద్యార్థులకు యూనిఫామ్లు అందజేత