బోనకల్లు, ఏప్రిల్ 01 : ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఖమ్మం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కర్రీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్లు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు మృతిచెంది పడిఉన్నాడు. వయస్సు దాదాఉ 30 సంవత్సరాలు. ఖమ్మం అన్నం ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.