మందమర్రి రూరల్, జూలై 17 : మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గల సమావేశపు మందిరంలో గురువారం ఎంపీడీఓ ఎన్.రాజేశ్వర్ ఆధ్వర్యంలో మండల పంచాయతీ అభివృద్ధి సూచికపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధి సూచికల్లో భాగంగా గ్రామీణాభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో భాగంగా తీసుకున్న సూచికలు, ప్రశ్నావళులు, డేటా సేకరణ, ఆ డేటా అప్లోడ్ ప్రక్రియ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.