Konark Express | కోణార్క్ ఎక్స్ప్రెస్ (Konark Express), రైలులో రెండు బ్యాగులు అనుమానస్పదంగా కనిపించగా వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్నారు. మధిర రైల్వే స్టేషన్ (Madhira railway station)లో గంజాయి పట్టుకున్నట్లు మధిర ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జే రామ్మూర్తి తెలిపారు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి జి నాగేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మధిర రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం భువనేశ్వర్ నుండి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలును మధిర రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు బ్యాగులు అనుమానస్పదంగా కనిపించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు బ్యాగులను ఓపెన్ చేసి చూడగా అందులో ఎండు గంజాయిను గుర్తించారు.
మధిర ప్రొబేషన్ ఎక్సైజ్ సీఐ రామ్మూర్తి మాట్లాడుతూ.. కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో రెండు బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న మధిర ఎక్సైజ్ పరిధిలో నాటు సారా మాదకద్రవ్యాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా డిపార్ట్మెంట్ వరకు తెలియజేయాలన్నారు. సమాచారం తెలిపిన వారి వివరములు గోప్యంగా ఉంచబడునని తెలిపారు.
పట్టుబడిన గంజాయిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ C.జనార్దన్ రెడ్డి, సిబ్బంది ఎస్డీ రజాలి , ఎస్కే రియాజ్ , ఎస్కే ముస్తఫా, బీ నాగరాజు పాల్గొన్నారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి