ఖమ్మం రూరల్, మార్చి 24 : ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి శివారులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్ దానవాయిగూడెం కాలనీకి చెందిన వల్లపు రాము (46), అతడి స్నేహితుడు కృష్ణమూర్తి (50), మరో వ్యక్తి నరేశ్ ముగ్గురూ దైవ దర్శనం నిమిత్తం శ్రీశైలం వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకునేలోపే మద్దులపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బలంగా చెట్టును ఢీకొట్టింది దీంతో వల్లపు రాము అక్కడికక్కడే మృతిచెందగా, కృష్ణమూర్తి ఖమ్మం వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో వ్యక్తి నరేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలిసిన రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పుష్కరాజ్ కేసు నమోదు చేశారు.