కూసుమంచి, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడనున్నాయని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పాలేరులో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను సందర్శించి మాట్లాడారు. విద్యార్థులకు సులువుగా పాఠాలు చెప్పేందుకు బోధన పరికరాలు ఉపయోగపడతాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను బట్టి పాఠాలు బోధించాలన్నారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి కేశపట్నం రవికుమార్, ఆత్మ చైర్మన్ రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్, సర్పంచ్ ఎడవల్లి మంగమ్మ, ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి, ఎంఈవో రామాచారి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కందాళ ఆర్థిక సాయం
భైరవునిపల్లికి చెందిన సైదులు గురువారం మృతిచెందాడు. ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, నాయకులు మరికంటి రేణుబాబు, పెద్దపాక వెంకటేశ్వర్లు, మల్లెబోయిన శ్రీను, కె.కనకరాజు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్‌లో ఈ నెల 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం నేలకొండపల్లిలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాలేరు డివిజన్ అధ్యక్షుడు దానకర్ణ, అధ్యక్షుడు వనం అచ్చుతరామారావు, కార్యదర్శి తాతా హనుమంతరావు, జర్నలిస్టులు పాల్గొన్నారు.