
ఖమ్మం: ఖమ్మంలోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు తొగరు భాస్కర్, ఎన్.కిషోర్,డేవిడ్ రాజ్, సతీష్, బిక్షంలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా తొగరు భాస్కర్ మాట్లాడుతూ మహానుభావుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలకు ఎన్నోహక్కులు లభించాయని అన్నారు.
ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేసుకోలిగామని అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, సుడా డైరెక్టర్ కొల్లు పద్మ, టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి, మైనార్టీ విభాగం అధ్యక్షులు తాజుద్దీన్, నగర ప్రచార కార్యదర్శి షకీనా, షాదీఖానా డైరెక్టర్ సతీం, ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, పరేందర్, షంషుద్దీన్, జోహార్, ఆసీఫ్, షరీప్, మున్న, అబ్దుల్, రెహమాన్, ఇసాక్, తదితరులు పాల్గొన్నారు.