Khammam | జేఎల్ఎం పోస్టుల భర్తీ కోసం టవర్ క్లెయింబింగ్ పరీక్షలు..

రఘునాథపాలెం: టీఎస్ ట్రాన్స్‌కో సంస్థ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా టవర్ ఎక్కే పోటీలను చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో జేఎల్ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామశివారులో ఉన్న విద్యుత్ టవర్లను ఎక్కించి పరీక్షలు నిర్వహించారు. టవర్ ఎక్కే పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా జరిగాయి. మహిళలు సైతం విద్యుత్ టవర్లను సునాయాసంగా ఎక్కేశారు. నిర్ధేశించిన సమయంలోనే టవర్లను ఎక్కి పురుషులకు ధీటుగా తమ సత్తా చాటారు.
టీఎస్ ట్రాన్స్‌కో లో ఖాళీగా ఉన్న జేఎల్ఎం పోస్టుల భర్తీకీ గానూ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఎంపికలను చేపట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 63మందిని ఎంపిక చేసి పరీక్షకు ఆహ్వానించారు. కాగా అఖరిఘట్టంగా టవర్ క్లెయింబింగ్ పరీక్ష పెండింగ్ ఉండగా అధికారులు రఘునాథపాలెం మండలంలో చేపట్టారు.
మొత్తం 63మందికి గానూ 50మంది హజరయ్యారు. 18మంది మహిళలు, 23మంది పురుషులు కెమేరాల పర్యవేక్షణలో విజయవంతంగా టవర్ ఎక్కారు. ఆపరేషన్ చేయించుకున్న కారణంగా ఒకరిని పోటీ నుంచి మినహాయించారు. ఈ పోటీలకు ట్రాన్స్‌కో సిఈ పుల్లయ్య, ఎస్ఈ దీపక్ నాయక్, డిఈలు దాసు, కృష్ణారావు, ఏవో రవీందర్, పీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

