ఖమ్మం, అక్టోబర్ 1 : శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చివరి రోజైన గురువారం మహిషాసురమర్దినిగా దర్శనమివ్వనున్నారు. నగరంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జమ్మిబండ పారువేట స్థలంలో ప్రత్యేక వేదికపై రాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ముస్తాబు చేశారు.