ఖమ్మం లీగల్, సెప్టెంబర్ 12: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జీ.రాజగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారమైతే ఇరుపక్షాల గెలుపుగా భావించవచ్చునని అన్నారు.
మోటారు వాహన ప్రమాద బీమా కేసులతోపాటు సివిల్ వివాదాల కేసులను మూడో అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాంప్రసాదరావు; సివిల్, క్రిమినల్ కేసులను రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి మురళీమెహన్, ప్రీ లిటీగేషన్ కేసులను న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ చంద్రశేఖర్‌రావు తమ తమ బెంచులలో పరిష్కరించనున్నట్లు చెప్పారు.