మధిర, సెప్టెంబర్ 22 : అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు చింతకాని ఎస్ఐ వీరేందర్ తెలిపారు. మండల పరిధిలోని పందిళ్లపల్లిలో ముదిగొండ మండలంలోని గంధసిరి సమీపంలో గల మున్నేరు నుండి అనుమతులు లేకుండా తరలిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను చింతకాని ఎస్ఐ వీరేందర్ తన సిబ్బందితో కలిసి అనుమతులను తనిఖీ చేశారు. తనిఖీల్లో పట్టుబడిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.