మామిళ్లగూడెం, మే 29: లోకసభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో లోకసభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న ఉదయం 8 గంటలకు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మ ధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెకింపు ఉంటుందన్నారు. కౌంటింగ్ సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలను గుర్తుంచుకోవాలని, ఈసీ మార్గదర్శకాలను పాటించాలని, ఎటువంటి సందర్భం ఎదురైనా ప్రశాంతంగా లెకింపు ప్రక్రియ పకడ్బందీగా నమోదయ్యేలా చూసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరికి సెల్‌ఫోన్ అనుమతిలేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రానికి ప్రతిఒకరూ తప్పనిసరిగా గుర్తింపుకార్డు తీసుకురావాలని, కౌంటింగ్ ఏజెంట్లతో ఎటువంటి సంభాషణలు పెట్టుకోవద్దని అన్నారు.
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో 14 కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తామని, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం 18 టేబుళ్లు ఉంటాయని అన్నారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెకింపు బృందాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. కంట్రోల్ యూనిట్ లెకింపు ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్ పూర్తిగా చెక్ చేసుకోవాలని, కంట్రోల్ యూనిట్ పింక్సీల్, గ్రీన్ ఫీల్డ్ చెక్ చేసి కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాలని, కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం17సీ నందు నమోదైన ఓట్లు సరిచూసుకోవాలని, తేడా వస్తే వెంటనే సదరు కంట్రోల్ యూనిట్‌ను సహాయ రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని కలెక్టర్ అన్నారు. కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెకింపు పూర్తయిన తర్వాత వీవీ ప్యాట్ల లెకింపు ప్రారంభమవుతుందని, వీవీ ప్యాట్ల ఓట్ల లెకింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈటీపీబీఎస్ విధానం ద్వారా సర్వీస్ ఓట్ల లెకింపు ప్రక్రియ పకాగా నిర్వహించాలన్నారు. శిక్షణ నోడల్ అధికారులు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌంటింగ్ అధికారులకు విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. శిక్షణ ఈవీఎం యంత్రాలతో మాక్ కౌంటింగ్ నిర్వహించి, కౌంటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అధికారులు ఆదర్శ్ సురభి, సత్యప్రసాద్, గణేశ్, వినోద్, సన్యాసయ్య, శ్రీరామ్, మదన్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
లోకసభ సాధారణ ఎన్నికల ఓట్ల లెకింపుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ సామాగ్రి, స్టేషనరీ సేకరణ పూర్తి చేయాలన్నారు. లెకింపు అనంతరం ఈవీఎం యంత్రాలను ఈవీఎం గోడౌన్‌కు తరలింపు ప్రక్రియకు వాహనాల, కూలీల ఏర్పాటు చేయాలన్నారు. లెకింపు విధుల సిబ్బంది, పోలీసు సిబ్బందికి అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేయాలన్నారు. పబ్లిక్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మీడియా కేంద్రం ఏర్పాటు చేసి, ఫలితాల ప్రదర్శనకు ఎల్ఈడీ స్రీన్, సమాచారం కోసం టెలివిజన్ల ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన విధంగా బ్యారికెటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అభ్యర్థులు, సిబ్బంది, ఏజెంట్లకు పాసుల జారీ చేయాలన్నారు. సెగ్మెంట్ల వారిగా ఫలితాల చేరవేతకు లైజన్ అధికారుల నియామకం చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చేవారిని ప్రిసింగ్ చేసి, తనిఖీల అనంతరం లోనికి అనుమతించాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పారింగ్కు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో డీఆర్డీవో సన్యాసయ్య, జడ్పీ సీఈవో వినోద్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీలత, జిల్లా పరిశ్రమల అధికారి అజయ్‌కుమార్, ఆర్అండ్బీ ఈఈ శ్యామ్‌ప్రసాద్, కలెక్టరేట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్లు మీనన్, అనురాధ బాయి, సత్యనారాయణ, రాంబాబు, ఈడీఎం దుర్గాప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.