మధిర, సెప్టెంబర్ 05 : భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మధిర సేవా సమితి ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో మధిర మండల పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షుడు లింగంపల్లి అప్పారావు, మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వీరయ్య, మధిర సేవా సమితి అధ్యక్షుడు పల్లపోతు ప్రసాదరావు, మువ్వా రామకృష్ణ, జంగా నరసింహారెడ్డి, రంగా హనుమంతరావు, అద్దంకి రవికుమార్, కుంచం కృష్ణారావు, వందనపు శ్రీనివాసరావు, చెడే రామకోటేశ్వరరావు, చల్లా సత్యనారాయణ, చలువాది కృష్ణమూర్తి, ఆర్టీసీ రిటైర్డ్ జల్లా రాధాకృష్ణమూర్తి, దొడ్డ శ్రీనివాసరావు, నేరెళ్ల శ్రీనివాసరావు, గాలి ప్రసాద్, కోనా సుబ్బారావు, చల్లా సత్యనారాయణ, వేముల నవీన్ కుమార్, వనపర్తి గురుమూర్తి పాల్గొన్నారు.
Madhira : ‘భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం’