ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 25 : మారుతున్న జీవనశైలిపై అనేక వైరస్లు దాడి చేస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో రసాయనశాస్త్ర ఆవశ్యకత ఫార్మాస్యూటికల్ రంగంలో గననీయంగా పెరిగిందని హైదరాబాద్ సీఎస్ఐఆర్ ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కే సురేష్‌బాబు అన్నారు. శుక్రవారం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్జకీరుల్లా అధ్యక్షతన సైన్స్ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ కెమికల్ అండ్ మెటీరియల్స్ సైన్స్ రీసెర్చ్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండురోజుల జాతీయ సెమినార్లో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఆహార అలవాట్లు, వాతావరణంలో వస్తున్న మార్పులు అనేక రుగ్మతలకు దారితీస్తున్నాయన్నారు. ఈ క్రమంలో రసాయనశాస్త్రం భిన్నరూపాల్లో కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. కేయూ కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ జీ బ్రహ్మేశ్వరి మాట్లాడుతూ ఫార్మా కంపెనీల ద్వారా కెమిస్ట్రీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు. కేయూ కెమిస్ట్రీ చైర్మన్ బీవోఎస్ ప్రొఫెసర్ వాసుదేవరెడ్డి, హైదరాబాద్ నైపర్ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్ శంకరయ్య, గుజరాత్ గాంధీనగర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బి ఈశ్వరయ్య, ఉస్మానియా కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పీ మురళీధర్‌రెడ్డి తమ సందేశాలు వినిపించారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, కెమిస్ట్రీ శాఖాధిపతి సదస్సు కన్వీనర్ డాక్టర్ పులబాల రమేశ్, అటానమస్ గవర్నింగ్ బాడీసభ్యులు రవిమారుత్, వైస్‌ప్రిన్సిపాల్స్ కేఎస్ఎస్ రత్నప్రసాద్, డాక్టర్ బీ వెంకటేశ్వరరెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు కళాశాల తెలుగు సీనియర్ అధ్యాపకులు శాంతికుమార్, భద్రూనాయక్, బాలకృష్ణ, శ్రీనివాస్, మహేశ్ పాల్గొన్నారు. తొలిరోజు 20 మంది పత్తు సమర్పించార