ఆక్రమించిన ప్రభుత్వ భూమిని రికవరీ చేయాలి
కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి సేద్యం చేస్తున్న భూమిని కలెక్టర్ గౌతం గురువారం పరిశీలించి ఆక్రమించిన భూమికి రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గానికి మంజూరైన నర్సింగ్ కళాశాల స్థలాన్ని పరిశీలించారు.
- కలెక్టర్ వీపీ గౌతమ్
కూసుమంచి, డిసెంబర్ 29: కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి సేద్యం చేస్తున్న భూమిని కలెక్టర్ గౌతం గురువారం పరిశీలించి ఆక్రమించిన భూమికి రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గానికి మంజూరైన నర్సింగ్ కళాశాల స్థలాన్ని పరిశీలించారు. జీళ్లచెరువు రెవెన్యూ పరిధిలోని కేశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలో 474 సర్వే నెంబర్లో 24 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా అం దులో 11 ఎకరాలు గిరిజనులకు అస్సైండ్ పట్టాలు ఇచ్చారు.
మిగిలిన దానిలో 2.5 ఎకరాలు గుట్ట, 3.5 ఎకరాలు మంచి భూమి ఉంది. కాగా మిగిలినదానిలో కొంత భాగం భూమిని కేశ్వాపురం రైతులు ఆక్రమించి సేద్యం చేస్తున్నారు. కలెక్టర్ పరిశీలిన సమయంలో భూమిలో మిరప తోట వేసి ఉండటంతో వివరాలు తెలుసుకుటుండగా రైతులు అభ్యంతరం తెలిపారు. ఎన్నెళ్లుగా భూమి సాగు చేసుకుంటున్నారో వారి వివరాలు తీసుకొని ఆర్ఆర్ యాక్టు కింద 30 సంవత్సరాలుగా కౌలు వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయుడిపై చర్యలకు ఆదేశం
కూసుమంచి మండలం గట్టుసింగారంలో పనిచేస్తున్న కేశ్వాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు భూమి వద్దకు వచ్చి తాతల నాటి నుంచి భూమిని చేసుకొంటున్నామని కలెక్టర్‌కు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి అయి భూమిని ఆక్రమిస్తావా? అని ప్రశ్నించగా మా అన్నయ్యదని చెప్పాడు. ఆతనిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీటీ అన్సారి, ఎంపీడీవో కరుణకార్రెడ్డి, ఎంపీఈవో రాంచందర్‌రావు, సర్వేయర్ రవి, నేషనల్ హైవే ఆదాని మేనేజర్ శ్రీనివాస్, అధికారులు ఉన్నారు.
సర్వీసు రోడ్డుకు కలెక్టర్ హామీ
కూసుమంచి రూరల్, డిసెంబర్ 29: జాతీయ రహదారిపై మండలంలోని మల్లాయిగూడెం పంచాయతీ శివారు హట్యాతండా వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటునకు సంబంధిత అధికారులతో మాట్లాడుతానని కలెక్టర్ వీపీ గౌతమ్ హామీ ఇచ్చారు. హట్యాతండా, మల్లాయిగూడెం, జుజ్జల్‌రావుపేట గ్రామాల రైతులు హైవేకు ఇటువైపు ఉన్న తమ భూముల్లోకి వెళ్లడానికి ఏడు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సివస్తున్నదని, తమకు సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని రైతులు పలు మార్లు హైవేపై రాస్తారోకో నిర్వహించారు. ఆయా గ్రామాల రైతులు ఈసమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేయగా, ఆయన కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ఈమేరకు కలెక్టర్ గౌతమ్ గురువారం సాయంత్రం జాతీయ రహదారిపై సర్వీసురోడ్డు ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరువైపులా సర్వీసు ఏర్పాటు చేసి, రోడ్డు దాటడానికి యూటర్న్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ బాదావత్ బిబ్లీ, కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, బాదావత్ రవి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. యూటర్న్ ఏర్పా టు చేస్తే ప్రమాదాలు జరుగుతాయని, ఇరువైపులా సర్వీ సు రోడ్డు ఏర్పాటునకు హైవే అధికారులకు ప్రతిపాదిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట హైవే అధికారులు దుర్గాప్రసాద్, శ్రీనివాస్, సుజాత, ఇరిగేషన్ డీఈ ఈ రమేశ్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ అన్సారీ, సర్వేయర్ రవి, రైతులు బాదావత్ రవి, వెంకన్న, వీరన్న ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

