కేంద్రానికి రైతుల బాగు పట్టదా?
‘కేంద్ర ప్రభుత్వానికి రైతుల బాగు పట్టదా?’ అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. చివరికి ఇటీవలి కేంద్ర మధ్యంతర బడ్జెట్లోనూ అన్నదాతలను నిరాశపరిచారని విమర్శించారు. అందులో వ్యవసాయ రంగానికి, రైతులకు మొండిచేయి చూపించారని దుయ్యబట్టారు.
- కేంద్ర మధ్యంతర బడ్జెట్లో అన్నదాతలను నిరాశ పరిచారు
- తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే చూస్తూ ఊరుకోం
- లోక్‌సభ చర్చలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు
ఖమ్మం, ఫిబ్రవరి 5: ‘కేంద్ర ప్రభుత్వానికి రైతుల బాగు పట్టదా?’ అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. చివరికి ఇటీవలి కేంద్ర మధ్యంతర బడ్జెట్లోనూ అన్నదాతలను నిరాశపరిచారని విమర్శించారు. అందులో వ్యవసాయ రంగానికి, రైతులకు మొండిచేయి చూపించారని దుయ్యబట్టారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్బంగా జరిగిన చర్చలో సోమవారం ఆయన మాట్లాడారు. ఇప్పటికీ గిట్టుబాటు ధర లేకుండా చేశారని, బడ్జెట్లో కనీస మద్దతు ధర అమలు గురించిన ప్రస్తావనే లేదని విమర్శించారు. కానీ దేశంలో ఎకడా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతులకు పంటల పెట్టుబడి సాయం అందించిన ఘనత ఒక కేసీఆర్‌కే దకుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కూడా ఆయనదేనని అన్నారు. అలాగే, విభజన హామీల అమలు విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని అన్నారు. విభజన చట్టాన్ని తెచ్చి పదేళ్లు కావస్తున్నా నేటికీ చాలా హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. దేశంలోనే అత్యధిక స్థాయిలో తెలంగాణలోనే ఆయిల్‌పాం పంట సాగవుతోందని అన్నారు. అయితే కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల ఆయిల్‌పాం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని అన్నారు. కృష్ణానదిపై ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల తెలంగాణ సమాజానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని, అయినప్పటికీ అప్పగిస్తే తాము ఊరుకోబోమని ఎంపీ నామా అన్నారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం.. ఆటవిక చర్య..: ఎంపీ నామా
ఖమ్మం, ఫిబ్రవరి 5: ఎన్టీఆర్ విగ్రహాన్ని దండుగులు ధ్వంసం చేయడం ఆటవిక చర్య అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం కరుణగిరి ప్రాంతంలోని రాజీవ్ స్వగృహలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం ఖమ్మం సీపీ సునీల్‌దత్‌కు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. తెలుగు ప్రజల గుండెల్లో కొలువై ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కొందరు ఇలాంటి దుర్మార్గపు చర్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నామని అన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

