ఖమ్మం, నవంబర్ 4: అన్నదాతలకు బీఆర్ఎస్ ఎప్పుడూ బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం పాటుపడుతుందని, అందుకోసం ఎల్లవేళలా పోరాడుతుందని గుర్తుచేశారు.
ఈ క్రమంలోనే తాజాగా పత్తి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు శ్రీకారం చుట్టినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించనున్నట్లు చెప్పారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నట్లు వివరించారు. తనతోపాటు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ సహా ఇతర నాయకులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.