హైదరాబాద్ : ఖమ్మం(Khammam) శివారులోని వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గుడిసెల తొలగింపునకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సుమారు 3 వేల మంది పోలీసులను రంగంలోకి దింపి బలవంతంగా గుడిసెలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్లు సమచారం.
మరోవైపు ఎనిమిది ఏండ్లుగా ఇక్కడ గుడెసెలు వేసుకొని జీవిస్తున్నామని ఇప్పుడు ఉన్న ఫలంగా ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. రోజు కూలీ పని చేసుకొని జీవించే తమలాంటి సమాన్యులపై దౌర్జన్యాలకు పాల్పడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.