కారేపల్లి, అక్టోబర్ 07 : సింగరేణి మండలం కారేపల్లి గ్రామానికి చెందిన ఆలయ పూజారి గోదావరి ఈశ్వర శాస్త్రి (60) గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. అర్చక సంఘం సభ్యులు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. మండలంలోని పరిసర ప్రాంతాల్లో గత 20 సంవత్సరాలకు పైగా ఈశ్వర శాస్త్రి అర్చక వృత్తి కొనసాగించాడు. కొంతకాలం దేవాదాయ ధర్మాదాయ శాఖలో పని చేశారు. అర్చక సంఘం తరఫున బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అర్చక సంఘం అధ్యక్షుడు కైలాస శర్మ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. నివాళులర్పించిన వారిలో కైలాస్ శర్మ, సురేష్ శర్మ, గణపతి, పట్ల వెంకటేశ్వర శర్మ, మధుసూదన శర్మ, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, అచ్యుత రామారావు, ఊటుకూరి ప్రసాద్ పాల్గొన్నారు.