కారేపల్లి, ఏప్రిల్ 14 : మూడున్నర కోట్ల ప్రజల తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేద్కర్ రాజ్యాంగమేననీ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ మదన్‌లాల్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం కారేపల్లిలోని బాబా సాహెబ్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు.
దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్‌ను ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ఉన్నం వీరేందర్, వైరా నియోజకవర్గ మాజీ రైతుబంధు కన్వీనర్ హనుమకొండ రమేశ్, తెలంగాణ ఉద్యమ నాయకుడు జడల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్, నాయకులు భూక్య చందు నాయక్, దొంకెన రవీందర్, సోమందుల నాగరాజు పాల్గొన్నారు.