ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి.. దీనిలో భాగంగా సోమవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పది నియోజకవర్గ కేంద్రాల్లో ‘తెలంగాణ రన్’ హోరెత్తింది.. అశ్వారావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కొత్తగూడెం రన్లో ఎమ్మెల్యే వనమా, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ గంగన్న, ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఖమ్మం నగరంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు. అన్ని చోట్లా ఉదయం 6 గంటలకు రన్ ప్రారంభమైంది. మొత్తానికి ‘2కే రన్’ ప్రజల్లో ఐక్యతను నింపింది.
ఖమ్మం, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ‘తెలంగాణ రన్’ ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమాల్లో వేలాది మంది యువతీ యువకులు భాగస్వాములయ్యారు. అన్ని చోట్లా ఉదయం 6 గంటలకు రన్ ప్రారంభమైంది. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రన్ ప్రారంభమైంది. రన్లో ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, నగర మేయర్ నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ విజయ్‌కుమార్, అదనపు కలెక్టర్ స్నేహలత, శిక్షణ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, ట్రైనీ ఐపీఎస్ అవినాశ్‌కుమార్, జిల్లా క్రీడల అధికారి పరంధామిరెడ్డి పాల్గొన్నారు.
నగరంలోని ట్యాంక్ బండ్ వరకు రన్ కొనసాగింది. సత్తుపల్లిలో జేవీఆర్ కళాశాల నుంచి లక్ష్మీప్రసన్న ఫంక్షన్హోల్కు వరకు రన్ సాగింది. సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. మధిర పట్టణంలోని వైఎస్సార్ చౌరస్తాలో రన్‌ను జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్యే రాములునాయక్ వైరా పట్టణంలో ఏసీపీ రెహమాన్‌తో కలిసి రన్‌ను ప్రారంభించారు. అశ్వారావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కొత్తగూడెం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రన్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ గంగన్న, కూసుమంచిలో రన్‌ను రూరల్ ఏసీపీ బస్వారెడ్డి ప్రారంభించారు. రన్లో రూరల్, కూసుమంచి సీఐలు రాజిరెడ్డి, జితేందర్‌రెడ్డి, భద్రాచలంలో రన్‌ను ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, మణుగూరు రన్‌ను డీఎస్పీ రాఘవేంద్రరావు పాల్గొన్నారు.