ఖమ్మం రూరల్, జనవరి 26: ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ బెల్లం ఉమా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ప్రతి ఒక్కరూ ఆసీర్వదించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, తహసీల్దార్ సుమ పాల్గొన్నారు.
చుంచు నారాయణకు పరామర్శ
మండలంలోని ఆరెంపుల, బారుగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పర్యటించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుతో కలిసి తొలుత బారుగూడెంలో జరుగుతున్న లక్ష్మీ తిరుపతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆరెంపుల గ్రామంలో ఇటీవల ఆనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నారాయణను పరామర్శించారు.