ఖమ్మం, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ కుట్రలకు తెరతీసింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడ్డంగా దొరికిపోయారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ దొంగ ‘బండి’ అని పోలీసులు నిర్ధారించారు. దీంతో బీజేపీ కుతంత్రంపై ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బండి సంజయ్ తీరును నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. అధికారం కోసం కమలం నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలు, వారి తల్లిదండ్రుల ఆశలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబర్దార్ బీజేపీ అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ బండి సంజయ్ ఆడిన గేమ్ ప్లాన్‌లో భాగంగానే పది ప్రశ్నాపత్రం లీకేజీ అయ్యిందని పేర్కొన్నారు. అభం శుభం తెలియని విద్యార్థులను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో ఏ-1 నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సాధారణ పౌరులు భగ్గుమన్నారు. బుధవారం పట్టణాలు, మండల కేంద్రా ల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ‘బీజేపీ డౌన్..డౌన్.. బండి సంజయ్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.. ప్రధాన కూడళ్లలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం సెంటర్లో బీఆర్ఎస్ చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాటమాడుతున్నారని, ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారన్నారు.
మణుగూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన స మావేశంలో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. అభం శుభం ఎరుగని విద్యార్థుల జీవితాలను బీజేపీ నాయకులు బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదన్నారు. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రి యా నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనకల్లో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు అలవాటుగా మారిందన్నా రు.
పేపర్ లీకేజీకి పాల్పడుతున్న అంశాన్ని తీవ్రంగా పరిగణించి పార్లమెంట్ బండి సంజయ్ ఎంపీ పదవిని రద్దు చేయాలన్నారు. దమ్మపేటలో అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రప్రభు త్వం రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టిందని, అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నదన్నారు. సత్తుపల్లి నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మ హేశ్, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, జూలూరుపాడు నిరసన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీశ్‌కుమార్, వైరాలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ బీడీకే రత్నం, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు షేక్ లాల్‌మహ్మద్, వేంసూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో ముఖ్యనాయకులు పగుట్ల వెంకటేశ్వరరావు, పాల వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, పుచ్చకాయల శంకర్‌రెడ్డి, మోరంపుడి ముత్తయ్య, మహేశ్వరరెడ్డి, మద్దిరెడ్డి పుల్లారెడ్డి, అశ్వారావుపేట నిరసన కార్యక్రమం లో ఎంపీపీ శ్రీరామ్మూర్తి, నాయకులు సంపూర్ణ, ప్రకాశ్‌రావు, రఘురాం, మోహన్, శ్రీను, హరి, ఆనంద్, కాంతారావు, నేలకొండపల్లిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య, కార్యదర్శి శ్రీను, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మీ, సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సతీశ్, నాయకులు వాజిద్, రవి, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, వెంకటనారాయణ, కనకప్రసాద్, నరసింహారావు పాల్గొన్నారు.
బండి సంజయ్ లీకేజీ సూత్రధారి ;అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నాపత్రాల లీకేజీ సూత్రధారి అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. దమ్మపేట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదోతరగతి ప్రశ్నాపత్రం బండి సంజయ్ లీక్ చేసి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలతో ఆడుకోవడం అమానవీయమన్నారు. బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. విద్యార్థులు భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో పరీక్షలు రాస్తుంటే వారిని నట్టేట ముంచేలా బీజేపీ పేపర్ లీకేజీ చేయిస్తున్నదన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలోనూ బీజేపీ హస్తం ఉందనేది తాజా పరిస్థితుల నేపథ్యంలో బహిర్గతమవుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో బీఆర్ఎస్కు తిరుగులేదన్నారు. బీజేపీ మాయమాటలు ప్రజలను బురిడీ కొట్టించలేవన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులెవరూ ఆందోళనకు గురికావొద్దన్నారు.
బీజేపీ నిజ స్వరూపం తేటతెల్లం ;ఎమ్మెల్యే వనమావెంకటేశ్వరరావు
పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీతో బీజేపీ నిజ స్వరూపం తేటతెల్లమైందని, లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ రకరకాల కుట్రలకు పాల్పడుతున్నదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టలేరన్నారు. ప్రజలెప్పుడూ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని, రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలే శ్రీరామరక్ష అన్నారు. బీజేపీ మతతత్వపు రాజకీయాలు ఎన్నో ఏళ్లు నిలబడవని స్పష్టం చేశారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, పలు మండలాల ఎంపీపీలు భూక్యా సోనా, బదావత్ శాంతి, విజయలక్ష్మి, కౌన్సిలర్లు రుక్మాంగధర్ బండారి, ధర్మరాజు పాల్గొన్నారు.
‘బండి’ సభ్యత్వాన్ని పార్లమెంట్ రద్దు చేయాలి
పేపర్ లీకేజీలకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎంపీ బండి సంజయ్ సభ్యత్వాన్ని పార్లమెంట్ వెంటనే రద్దు చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు డిమాండ్ చేశారు. బోనకల్లులోని బీఆర్ఎస్ మండల కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనపై బురదజల్లడమే పనిగా బీజేపీ కుట్రలు చేస్తున్నదన్నారు. బండి సంజయ్ తన అనుచరులతో పన్నాగం పన్ని పదోతరగతి పేపర్ లీకేజీకి పాల్పడ్డాడని ఆరోపించారు. ప్రశ్నాపత్రాన్ని వైరల్ చేసేందుకే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని మండిపడ్డారు.బీజేపీ కుట్రల్లో ఇది పరాకాష్ఠ అన్నారు. పేపర్ లీకేజీకి పాల్పడి విద్యార్థులతో చెలగాటమాడుతున్నారన్నారు. వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, పార్టీ నాయకులు బంధం శ్రీనివాసరావు, కొండా, మోదుగుల నాగేశ్వరరావు, గద్దల వెంకటేశ్వర్లు, కాకాని శ్రీనివాసరావు, పారా ప్రసాద్, ఉపేందర్, నరసింహారావు, ముక్కపాటి బీరయ్య, మహేశ్వరరావు, షేక్ సైదా, యార్లగడ్డ చిన్ననరసింహ పాల్గొన్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు..
పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై వస్తున్న వార్తలను చూసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన అనుచరులతో ప్రశ్నాపత్రాన్ని అవుట్ చేయించారన్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు యత్నించాడన్నారు.ప్రజల మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడన్నారు. పేపర్ లీకేజీ చేయించి బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయాడన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో బీజేపీ అరాచకాలను ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. మున్ముందు వారే బుద్ధి చెప్తారన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రతి పోటీ పరీక్ష, పోటీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్నదన్నారు.80వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, పరుచూరి వెంకటేశ్వర్లు, మనోహర్ తివారి, కుంటా నవాబ్, గిన్నారపు రాజేశ్, పాషా పాల్గొన్నారు.
విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం
బీఆర్ఎస్ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనలేక, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించి కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. కేసులతో బెదిరించాలని ప్రయత్నించి విఫలమైన బీజేపీ నేతలు ఇప్పుడు పిల్లల భవిష్యత్తును రాజకీయ చదరంగంలో పావుగా పెడుతున్నారు. పేపర్ లీకేజీలకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీకి గుణపాఠం తప్పదు. బండి సంజయ్ అజ్ఞాని, అబద్ధాల యూనివర్సిటీలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారు.
– ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
‘బండి’ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
బీజేపీ కుట్రలకు ఇది పరాకాష్ఠ. రాజకీయ ప్రయోజనాల కోసం విద్వేషపు మంటలు రేపుతున్నది. ఇప్పుడు మరింత నీచానికి తెగబడింది. తెలంగాణలో మత చిచ్చు ప్రయత్నాలు ఫలించక పోవడంతో తెలంగాణ బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నది. వారి తల్లిదండ్రుల ఆశలు, శ్రమపై నీళ్లు చల్లుతున్నది. పదో తరగతి ప్రశ్నాప్రతం లీకేజీ సూత్రధారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి.
– ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు