మధిర, మే 31 : బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు శనివారం మధిరలో ఘనంగా నిర్వహించారు. పట్టణ, రూరల్ బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయంలో పూజలు నిర్వహించి, పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పల్లబోతులు వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మొండితోక లత, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రంగశెట్టి కోటేశ్వరరావు, జిల్లా నాయకుడు మొండితోక జయాకర్, సహకార సంఘం అధ్యక్షుడు బిక్కీ కృష్ణ ప్రసాద్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు కొఠారి రాఘవరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, చారు గుండ్ల నరసింహమూర్తి, గద్దల స్వామి, గుగులోతు కృష్ణ, కొత్తపల్లి నరసింహారావు, పాలవంచ రామారావు పాల్గొన్నారు.
Madhira : మధిరలో తాతా మధు జన్మదిన వేడుకలు