కారేపల్లి, మే 07 : ఇన్సూరెన్స్ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఎండీఆర్టీ (Million Dollar Round Table) ఏజెంట్‌గా ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన సీనియర్ ఎల్ఐసీ ఏజెంట్ ఇందుర్తి సురేందర్ రెడ్డి ఆరోసారి అర్హత సాధించాడు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ సురేందర్ రెడ్డిని ఎల్ఐసీ సంస్థ వరంగల్ డివిజన్ సీనియర్ డివిజినల్ మేనేజర్లు కె.సుధాకర్ బాబు, ఎం.సుబ్రహ్మణ్యన్, మార్కెటింగ్ మేనేజర్ ఎన్.గోపాలకృష్ణ ఘనంగా సన్మానించారు.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లతో జరిగే ఎండీఆర్టీ సమావేశానికి కొత్తగూడెం బ్రాంచ్ నుండి గత ఆరు సంవత్సరాలుగా అర్హత సాధించిన సందర్భంగా అధికారులు బుధవారం వరంగల్‌లో సురేందర్‌రెడ్డిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పాలసీదారులకు, ఎల్ఐసీ అధికారులకు సురేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.