మధిర, ఏప్రిల్ 08 : ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రజలు సహకరించడం అభినందనీయమని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని రొంపిమళ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో గొల్లమందల శ్రీనివాసరావు ప్రోత్సాహంతో విద్యార్థులు కూర్చునేందుకు పది బళ్లాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ… పాఠశాల అభివృద్ధి కోసం దాతలు ముందుకు వచ్చి విద్యాభివృద్ధి తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు.
అనంతరం స్కూల్ బెంచీలు దానం చేసినటువంటి కారుమంచి చెంచులు అనసూర్య, గొల్లమందల నాగరాజు కుమార్ విజయ, గొల్లమందల సురేశ్, గోపాలరావు, రామారావు, బాబురావును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వై.ప్రభాకర్ రావు, సిరిపురం హెచ్ఎం మురళీకృష్ణ రొంపిమాళ్ల హెచ్ఎం పిల్లి నరసింహారావు, టీచర్ శాంతిబాబు, గ్రామ పెద్దలు తలపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తలపురెడ్డి నారాయణ రెడ్డి, అన్నం కృష్ణారెడ్డి, షేక్ సైదులు, అల్లాడి లక్ష్మణ్, ములుగు వెంకటాచారి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.