Khammam Rural : సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శం : పోతినేని సుదర్శన్‌రావు
మార్క్సిస్ట్ యోధుడు,,దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు.
ఖమ్మం రూరల్, మే 19 : మార్క్సిస్ట్ యోధుడు,,దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం, కాచిరాజుగూడెం, గుదిమళ్ల, తెల్దారుపల్లి, మద్దులపల్లి, పొన్నెకల్లు, తల్లంపాడు, ఎం.వెంకటాయపాలెం, అరేంపుల గ్రామాల్లో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో పోతినేని మాట్లాడుతూ… ఉన్నత కుటుంబంలో పుట్టి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయుడు సుందరయ్య అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని సుందరయ్య లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని కుల, మత రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుగ్గవీటి సరళ, సీనియర్ నాయకులు మామిండ్ల సంజీవరెడ్డి, సిద్దినేని కోటయ్య, బత్తినేని వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్, షేక్ బషీరుద్దీన్, మండల నాయకులు పి.మోహన్ రావు, పి.సంగయ్య, నందిగామ కృష్ణ, వడ్లమూడి నాగేశ్వరరావు, తోట పెద్ద వెంకట్‌రెడ్డి, వై.ప్రసాద్ రావు, పొన్నం వెంకటరమణ, పల్లె శ్రీనివాసరావు, యామిని ఉపేందర్, పెండ్యాల సుమతీ, వరగాని మోహన్ రావు, కోటి శ్రీనివాస్, పెంట్యాల నాగేశ్వరరావు, అద్దంకి తిరుమలయ్య, పొన్నం మురళి, భాస్కరరావు, మడిపల్లి వెంకన్న, రాజశేఖర్, గాయత్రీ, యండపల్లి వెంకటరామయ్య, సీతారాం రెడ్డి, మద్ది వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

