బోనకల్లు, ఆగస్టు 22 : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎం జె పి గురుకుల విద్యాలయంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, భోజనశాలను, కూరగాయలను, బియ్యాన్ని ఆయన పరిశీలించారు. గురుకుల విద్యాలయంలో పూర్తిస్థాయి సౌకర్యాలు లేవని దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఎంఈఓ స్పందిస్తూ.. విద్యాలయంలో కావాల్సిన వసతులు, వనరుల కల్పనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ లింగం కిరణ్మయి, సిబ్బంది ఉన్నారు.
Bonakal : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : ఎంఈఓ పుల్లయ్య