బోనకల్లు, ఏప్రిల్ 07 : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని ఏఎంఓ రవికుమార్ అన్నారు. సోమవారం బోనకల్లు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను తాసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్, ఎంఈఓ దామల పుల్లయ్యతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను, వంట సామాగ్రి, వంట గదిని అలాగే విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మధ్యాహ భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రకటించిన మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.