కారేపల్లి, సెప్టెంబర్ 18 : ఉసిరికాయలపల్లి (శాంతినగర్) సమీకృత గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం సింగరేణి మండల తాసీల్దార్ అనంతుల రమేశ్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహాకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాసిరకపు కూరగాయలతో వంటలు చేయవద్దన్నారు. నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసి భోజనాన్ని అందించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని, విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత వార్డెన్ పై ఉందన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట పాఠశాల హెచ్ఎం బి.ధర్మా, జి.నాగరాజు, టి.వెంకటరమణ, ఉపాధ్యాయులు ఎం.బావు సింగ్, బి.రాందాస్, బానుచందర్, రవి, సోమ్లా, రాములు పాల్గొన్నారు.