బోనకల్లు, జులై 11 : బోనకల్లు మండలంలోని ముష్టికుంట ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ సీఈఓ దీక్ష రైనా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల కోసం తయారు చేసిన వంటలను తిని పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి కావాల్సిన వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని పాఠశాల హెచ్ఎం, సిబ్బందికి సూచించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కిచెన్ గార్డెన్‌ను పరిశీలించి పిల్లలకు ఉపయోగపడే కూరగాయల మొక్కలను పెంచాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామంలో ఫ్రై డే డ్రై డే కార్యక్రమంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్.రమాదేవి, ఎంపీఓ శాస్త్రీ, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Bonakal : మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి : జడ్పీ సీఈఓ దీక్ష రైనా