కూసుమంచి, జనవరి 28: కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు 42 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు బేబీ చంద్ర, సత్తిరెడ్డి, రామకృష్ణ, శ్రీరామారావు, నర్సయ్యను పూర్వ విద్యార్థ్దులు సన్మానించారు. సాయంత్రం వరకు సందడిగా గడిపారు. పూర్వ విద్యార్థులు కూరపాటి రామారావు, దామళ్ల పాపారావు, నాజర్, కూరపాటి వనజ, బతకమ్మ, పిట్టల వెంకటేశ్వర్లు, విజయ్‌రావు, శీలం గురవయ్య, శీలం లచ్చయ్య పాల్గొన్నారు.
చింతకాని, జనవరి 28 : మండల పరిధిలోని తిమ్మినేనిపాలెం ఉన్నత పాఠశాలలో 2005-06 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఒకేచోట కలుసుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాబుద్దులు నేర్పిన గురువులను, తోటి మిత్రులనున ఆత్మీయంగా పలకరించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గురువులను శాలువా, మెమోంటోలతో సన్మానించారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, చిరంజీవి, శ్రీరాం, కిరణ్మయి, నాగేంద్రయ్య, బాబు, మణికుమార్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.