కారేపల్లి, మే 30 : ప్రముఖ కంపెనీ విత్తనాలంటూ వాటిని బ్లాక్‌లో విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో కారేపల్లి మండలంలోని విత్తన డీలర్లు, షాపు యాజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ మాట్లాడుతూ షాపులో విక్రయాలు చేస్తున్న విత్తనాలకు సంబంధించి అన్ని దృవీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విత్తనాలను ఎమ్మార్పీ ధరకు మించి అమ్మకాలు సాగించవద్దన్నారు.
గ్రామాల్లో అనధికారిక అమ్మకాల సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేయాలని కోరారు. నిషేధిత బీటీ`3 విత్తనాలు అమ్మకాలు చేయవద్దని వాటితో పర్యవరణంతో పాటు మానవ మనుగఢకు ముప్పు ఉంటుందన్నారు. గ్లౖెెకోసెట్ కలుపు మందు అమ్మకాలు చేయవద్దని, అమ్మకాలు చేసిన వారిపై, దానిని వినియోగించిన రైతులపై కూడా కేసులు పెట్టటం జరుగుతుందని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎన్.రాజారాం, ఏఓ బి.అశోక్‌కుమార్ పాల్గొన్నారు.